గర్భం దాల్చిన యువకుడు.. పెరుగుతున్న అండం !

ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అరుదైన ఘటనలు చోటు చేసుకుంటాయి. అందులో పురుషుడు గర్భం దాల్చడం ఒకటి. ఇలాంటి ఘటనలు కోట్లల్లో ఒకరికి సంభవిస్తుంది. మహిళలకే పురిటినొప్పులు, జన్మ సాధ్యం. కానీ మగాళ్లలో వచ్చే హర్మోన్ మార్పుల వల్ల మగాళ్లు సైతం గర్భం దాల్చుతారు. తాజాగా అమెరికాలో ఓ పురుషుడు గర్భవతి అయ్యాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అయ్యాడు. నమ్మాలని లేదు కదూ. మీరు ఈ స్టోరీవైపు ఓ లుక్కేయండీ క్లారిటీ వచ్చేస్తుంది.

men pregent
men pregent

అతనిది అమెరికాలోని బోస్టన్ నగరం. తను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు స్కానింగ్ చేయగా.. డాక్టరు అమ్మాయిగా నిర్ధారించారు. కానీ, ప్రసవం తర్వాత పురష జననాంగంతో కనిపించాడు. అంతే అందరూ షాక్ అయ్యారు. పుట్టిన పిల్లాడికి మైకీ అని పేరు పెట్టారు. మైకీ పెద్దవుతున్న కొద్దీ అన్నీ మహిళ లక్షణాలే ఉండటం గుర్తించారు తల్లిదండ్రులు. ఒక్క పురుషాంగం తప్ప అమ్మాయి మాదిరగానే ఉండేవాడు. ఆ సమయంలో స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడేవాడట. అతని శరీర ఆకృతిని, ప్రవర్తను చూసి అందరూ ఏడిపించేవారు. 13ఏళ్ల వయసు నాటికి తను ట్రాన్స్ జెండర్ అనే స్పృహ కలిగింది.

ప్రస్తుతం మైకీ చానెల్ వయసు 18 ఏళ్లు. కొంత కాలంగా అతను మూత్రం పోసేటప్పుడు పురుషాంగంలో విపరీతమైన నొప్పి, ఇబ్బంది తలెత్తాయి. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా షాకింగ్ విషయం బయటపడింది. మైకీ జననాంగం లోపలి భాగంలో అండాల ఉత్పత్తి జరుగుతోందని, అతని కడుపులో గర్భాశయం, ఫెలోపియన్ ద్వారాలు కూడా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అతను గర్భం దాల్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. కొంతమంది దీన్నొక అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.

‘‘నేను కూడా పిల్లల్ని కనొచ్చని డాక్టర్లు చెప్పినప్పుడు చుట్టూ చూశాను. ఎవరైనా ప్రాంక్ వీడియో చేస్తున్నారేమో అనుకున్నా.. కానీ అది సీరియస్ విషయమని అర్థమయ్యాక నిజంగా సంతోషించాను. అమ్మాయిగా ఉండాలన్నదే నా కోరిక. ఇక అమ్మతనాన్ని కూడా పొందే అదృష్టం రావడాన్ని వరంగానే ఫీలయ్యా. “ అని మైకీ చెప్పారు. కొన్ని ప్రయోగాలు చేసిన అనంతరం ఓ దాత నుంచి స్పెర్మ్ తీసుకుని తనలోకి ప్రవేశపెట్టారు. 20 శాతమే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అదృష్టవశాత్తూ అది వర్కౌట్ అయింది. తన బిడ్డను బాగా పెంచుకుంటూ, ముందుగా డిగ్రీ పూర్తి చేయాలన్నది ప్రస్తుతం తమ ముందు ఉన్న లక్ష్యమని మైకీ చానెల్ వివరించారు.