కోహ్లీ,రోహిత్ విభేదాల పై క్లారిటీ వచ్చినట్టేనా

Join Our Community
follow manalokam on social media

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు ఉన్నాయంటూ.. చాలా రోజులుగా ఒక ప్రచారం ఉంది. ఆ విభేదాల కారణంగానే.. రోహిత్ శర్మ ను ఆసీస్ టూర్ కు ఎంపిక చేయలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతోగాని, చర్చ మాత్రం విపరీతంగా జరిగింది. దీంతో, నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాషెస్‌ ఉన్నాయేమోనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అనుకోవడం కామనైపోయింది.అయితే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో.. కనిపించిన ఓ దృశ్యం వాటన్నింటినీ కొట్టిపారేసేలా చేసింది.

క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య కిరికిరి ముచ్చట్లు.. బాగానే వినిపిస్తుంటాయి. అలాంటి గొడవలే విరాట్‌, రోహిత్‌ల మధ్య కూడా ఉన్నట్టు.. బోలెడంత ప్రచారం జరిగింది. కానీ, ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కనిపించిన దృశ్యం ఆ ప్రచారాన్ని పటాపంచెలు చేసింది. అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న ఊహాగానాలకు ఈ పన్నివేశం చెక్ పెట్టింది.

చపాక్ వేదికగా భారత్-ఇంగ్లాండ్‌ మద్య జరుగుతున్న మ్యాచ్ ఓ అద్భుతం దృశ్యానికి వేదికైంది. తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టేలా మ్యాచ్ మధ్యలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. తొలిత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం రోహిత్,శుభామన్ గిల్ ఓపెనర్స్‌గా బరిలోకి దిగారు.

ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన బంతి రోహిత్‌ శర్మ చక్కటి కవర్‌ డ్రైవ్‌తో తన పరుగుల ఖాతాను తెరిచాడు. రోహిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి ఆ షాట్‌ను చూసిన కోహ్లి యస్‌ బాయ్‌.. కమాన్‌ రోహిత్‌.. యూ క్యాన్‌ డూ ఇట్‌” అంటూ రోహిత్‌ను సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెుదటి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్ ఫర్మమెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లీష్ బౌలర్స్‌ను ధీటుగా ఎదుర్కొంటున్న హిట్‌ మ్యాన్‌.. సెంచరీ బాదేశాడు. . భారత్ వరుస వికెట్లు కోల్పోయిన సమయంలో రోహిత్.. తన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఫోర్లతో విరుచుపడుతూ పడుతూ తనఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. చివరకు 161 పరుగుల దగ్గర ఔటయ్యాడు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....