రిషికేశ్-బద్రీనాథ్ రహదారి మూసివేత.. వర్షాల కారణంగా?

-

రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఖన్‌క్రా సమీపంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారిని మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రోడ్డుపై పడిన రాళ్లు, రప్పలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. వరద బీభత్సం కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.

రిషికేశ్-బద్రీనాథ్ రహదారి
రిషికేశ్-బద్రీనాథ్ రహదారి

అలాగే కుచ్డనుల్లా వద్ద కూడా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌కు వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై కొండచరియలు ఏర్పడి బండరాళ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. దీంతో అధికారులు బద్రీనాథ్ హైవేను మూసివేశారు. దీంతో యాత్రకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కేదార్‌నాథ్ యాత్ర వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news