ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొందరి వ్యవహార శైలి పూర్తిగా పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తోంది. తాజాగా ఏపీలో మరోసారి పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సీఎం కాన్వాయ్ కోసం అంటూ ప్రైవేటు వాహనాన్ని తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసం అంటూ తిరుమల కు వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఆపి వాహనాన్నా తీసుకెళ్లిన ఉదంతంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేసిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి వినుకొండ నుంచి తిరుమల వెళ్తున్న ఓ కటుంబం టిఫిన్ కోసం ఒంగోలులో ఆగింది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ సీఎం పర్యటనకు కాన్వాయ్ కావాలంటూ.. వాహనం, డ్రైవర్ ను తీసుకెళ్లాడు. దీంతో సదరు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. ఈ నేపథ్యంలోనే సదరు పోలీసులపై చర్యలు తీసుకోనున్నారు. గతంలో సీఎం విశాఖ పర్యటనలో కూడా పోలీసులు ఇలాగే అత్యుత్సాహం చూపించారు. పోలీసుల ఆంక్షల కారణంగా విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వారు తమ లగేజీతో కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా సీఎం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల ఓవరాక్షన్ పై సీఎం జగన్ ఆగ్రహం… వాహనం తీసుకెళ్లడంపై చర్యలకు ఆదేశం
-