అమరావతి : పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్. టిడిపి నేతల వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ గా మాట్లాడారు. తమ వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోషడీకే అని లంజాకొడుకు అని తిట్టడం కరెక్టేనా ? ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి తల్లిని ఇలా బూతులు తిట్టడం కరెక్టేనా ? అని టిడిపి పై ఫైర్ అయ్యారు.
అసాంఘిక శక్తులు రాజకీయ నాయకులుగా రూపం మార్చుకున్నాయని.. కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేర స్వభావాలు మారుతున్న ఈ కాలంలో వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయని.. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఈ రాష్ట్రంలో నేరం కొత్త రూపాల్లో దాడి చేస్తోందని మండిపడ్డారు. ఇటువంటి ఓ కొత్త రూపాన్ని గత రెండేళ్లుగా రాష్ట్రంలో చూస్తున్నామని.. అధికారం దక్క లేదని చీకట్లో గుళ్ళ పై దాడులు చేస్తున్నారని అగ్రహించారు. అధికారం దక్క లేదని కులాలు, మతాల మధ్య చిచ్చు రేపటానికి వెనుకడుగు వేయడం లేదని చురకలు అంటించారు. అధికారం దక్క లేదని సంక్షేమ పథకాలను కూడా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.