ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో జగన్ ఎక్కువగా తప్పులు చేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు కొన్ని లక్ష్యాలను పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఆయనకు ఇబ్బందికరంగా లేకపోయినా సరే పార్టీని ఇబ్బంది పెడుతున్నాయనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది.
ప్రధానంగా ఇతర పార్టీల నేతలను తీసుకునే విషయంలో జగన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లో గెలిచిన వాళ్ళ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గ్రామాల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను ఇప్పుడు వైసీపీలోకి తీసుకోవాల్సిందిగా జగన్ కొంతమందికి ఆదేశాలు ఇచ్చారు అని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది.
ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది స్పష్టత రావటం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి ఎవరు వెళ్ళినా సరే జగన్ చేసేది కూడా చంద్రబాబు రాజకీయం అనే అభిప్రాయం ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి వైసీపీ లోకి తీసుకున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు కాస్త జగన్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారని కొన్ని అంశాలను ఎక్కువగా గమనిస్తున్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి.