ఏపీ ప్రభుత్వం రాష్ట్రం లోని డ్వాక్రా గ్రూపు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 7వ తేదీ నుండి పది రోజులపాటు రాష్ట్రం లోని మహిళలు అందరికీ విజయదశమి కానుకగా రెండో విడత వైఎస్ఆర్ చెక్కులు అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ పథకం కోసం మొత్తం రూ.6,500 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రం లోని దాదాపు 80 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతారని సీఎం వ్యాఖ్యానించారు.
ఇక సీఎం తీసుకున్న ఈ నిర్ణయం తో రాష్ట్రం లోని డ్వాక్రా మహిళలకు ఎంతో మేలు జరగనుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని అనుకున్న మహిళలకు అసరా గా మారనుంది. ఇదిలా ఉండగా జగనన్న తోడు కార్యక్రమం లో భాగంగా అక్టోబర్ 19 నుండి చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వడ్డీ లేని రుణాల ద్వారా చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకునే అవకాశం ఉంది.