అర్హులై సంక్షేమ పథకాలు అందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారికి లబ్ది చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అర్హులై సంక్షేమ పథకాలు అందని వారికి ఇవాళ ఆర్థిక సాయం చేయనున్నారు సీఎం జగన్.
ఏటా డిసెంబర్, జూన్ నెలలో సమీక్ష చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. లబ్ది దారుల ఖాతాల్లో రూ.137 కోట్లు జమచేయనున్నారు సీఎం జగన్. ఇక ఇవాళ 9,30,809 మంది అర్హులైన లబ్ధిదారులకు 137 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి వివిధ పథకాల కింద జమ చేయనున్నారు సీఎం వైయస్.జగన్.
ఇది ఇలా ఉండగా…వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆ తర్వాత.. రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని ప్రకటన చేశారు. అలాగే… 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్… ఈ రేషన్ అంతా ఉంది.. వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలన్నారు. ముంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి… కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సూచనలు చేశారు.