ప్రపంచస్థాయి విద్యాబోధనే లక్ష్యం : సీఎం జగన్‌

-

ఏపీ సీఎం జగన్‌ నేడు రాష్ట్ర విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా, ఇంటర్మీడియట్ లో ఇంటర్నేషనల్ బోర్డు (ఐబీ) సిలబస్ అంశంపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఇంటర్ సిలబస్ పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్‌. ప్రపంచస్థాయి విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉద్యోగం సాధించేలా విద్యావిధానం ఉండాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

YS Jagan to tour Palanadu district, to launch Family Doctor concept

మన రాష్ట్రంలో ఒక విద్యార్థి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్ సర్టిఫికెట్ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా ఒకే విలువ ఉండాలని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని అధికారులకు సీఎం జగన్‌ వివరించారు.

దాంతోపాటే, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలు కల్పించేలా అంతర్జాతీయ విద్యాసమాజంలో ప్రపంచస్థాయి సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా కార్యాచరణ ఉండాలని సీఎం జగన్ తెలిపారు. విద్యా వ్యవస్థలో మెరుగైన ప్రమాణాలు సాధించేందుకు ఏఐని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news