జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త..గ్రామ సర్వేయర్ గ్రేడ్లపై కీలక నిర్ణయం

-

 

ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు గ్రామ సర్వేయర్ గ్రేడ్ -1, గ్రేడ్ -2, గ్రేడ్ -3 పోస్టులను కొత్తగా సృష్టించింది. అయితే గ్రామ సర్వేయర్ లను మూడు గ్రేడ్లుగా విభజించడం వల్ల ప్రమోషన్ ఆలస్యం అవుతుంది. కావున వీటిని రెండు గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి.

cm jagan
cm jagan

అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై మేము కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు G.O.Ms.No. 161 ద్వారా గ్రామ సర్వేయర్లను రెండు గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని… దీని వల్ల గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్ -3 గ్రామ సర్వేయర్లు అందరూ గ్రేడ్ -2 గ్రామ సర్వెయ్యర్లుగా మారతారని వివరించారు. గ్రామ సర్వేయర్ గ్రేడ్ లను తగ్గించి గ్రామ సర్వేయర్లకు ప్రమోషన్ అవకాశాలు మెరుగుపరిచిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రెవిన్యూ శాఖ మాత్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ గారికి సర్వే కమిషనర్ శ్రీ సిద్ధార్థ్ జెన్ గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news