హైదరాబాద్ ఎయిర్​పోర్టులో మళ్లీ కరోనా పరీక్షలు

-

ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కరోనా సమయాత్తమవుతోంది. ఇప్పటికే భారత్​ సహా పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా భారత్​లో ఆరు నెలల తర్వాత మూడు వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

భారత్‌తోపాటు విదేశాల్లో ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా శంషాబాద్‌కు వస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ప్రతి వంద మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో అనుమానం ఉన్న ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్​పోర్టు వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. అయితే, కరోనా లక్షణాలున్న ప్రయాణికులు మాత్రం విధిగా మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news