జగన్ సంచలన నిర్ణయం… కొత్త జిల్లాకు ఎన్టిఆర్ పేరు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అంటూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు 25 జిల్లాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముందు మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించి… గురజాల మచిలీపట్నం, అరకులో ఏర్పాటు చెయ్యాలని చూసారు. అయితే ఇప్పుడు ఆయన వ్యూహం మార్చారు.

25 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని… పార్లమెంట్ సమావేశాలు జరిగిన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన చెయ్యాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే జగన్ పాదయాత్ర లో ఒక హామీ ఇచ్చారు.

తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అని అప్పట్లో జగన్ ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోయే మచిలీపట్నం జిల్లాలో ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడ కూడా చేరుతుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం జిల్లాకు వైసీపీ ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉందని ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.

ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అని జగన్ స్వయంగా హామీ ఇవ్వడంతో… దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందనే అభిప్రాయం వైసిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రాజధాని తరలింపు విషయంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తే అది వైసీపీ కి ఎంత మేర ప్రభావం చూపిస్తుంది… అక్కడి ప్రజల్లో నుంచి ఎంత వరకు సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news