ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ ఇప్పుడు మంత్రుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. అమరావతి ఉద్యమం రోజు రోజుకి తీవ్రం కావడం, మంత్రులు వారితో చర్చలు అనుకున్న స్థాయిలో జరపకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. వారం రోజుల నుంచి ఉద్యమం తీవ్రం కావడం, విజయవాడ సహా పలు ప్రాంతాలకు ఉద్యమం విస్తరించడం,
మంత్రులు చర్యలు తీసుకోలేకపోవడం ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. సీనియర్ మంత్రులు ఉన్నా సరే రైతులను కలిసి మాట్లాడటం లేదని, కృష్ణా గుంటూరు జిల్లాల్లో అయిదుగురు మంత్రులు ఉన్నా సరే వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదని జగన్ ఆగ్రహంగా ఉన్నారట. స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకుని చర్చలు జరిపి ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం లేదనే అసహనం జగన్ లో తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది.
దీనితో ఇప్పుడు వారిని మంత్రి వర్గం నుంచి సాగనంపే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారట. రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నా సరే కనీసం తనను కూడా సంప్రదించకుండా చోద్యం చూస్తున్నారని, మూడు రాజధానుల వలన ఉపయోగాలను ప్రజలకు వివరించడం లేదని, రైతులకు ప్రభుత్వం ఎం చేస్తుందో చెప్పడం లేదని జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయట.