గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి పనితీరు మదింపునకు ప్రభుత్వం కొత్తగా పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ ను రూపొందిస్తోంది. సచివాలయంలో మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఒక్కొక్క కేటగిరి ఉద్యోగి పనితీరు మదింపునకు వారి జాబ్ చార్ట్ ల ప్రకారం వేర్వేరు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ ఇండికేటర్స్ ఆధారంగా మండలస్థాయి అధికారులు ప్రతినెల వారి పరిధిలోని సచివాలయాల ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారు.
సంతృప్తికరం, తృప్తికరం, పర్వాలేదు, అసంతృప్తికరంగా రేటింగ్ ఇస్తారు. వరుసగా కొన్ని నెలలు అసంతృప్తికరం రేటింగ్ పొందే ఉద్యోగులకు మెలకువలు పెంపొందించుకునే శిక్షలు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.