రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ పర్యటన లో భాగంగానే… రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఉదయం 11 గంటలకు తణుకు చేరుకోనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. అనంతరం… జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇక రేపు మధ్యాహ్నం 1 గంటకు తణుకు నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.