రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

-

ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో ఒక కొత్త డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్‌ భవిష్యత్‌లో మరింతగా విస్తరించనున్నారు. ఇది సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్‌ డిజైన్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్‌ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్‌ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

CM to launch YSR Cheyutha in Yemmiganur on Oct 19

అనకాపల్లి జిల్లా పర్యటన వివరాలు

యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ. ఫార్మా, బయెటెక్‌ ఉత్పత్తులకు సంబంధించి రూ. 300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. లారస్‌ సింథసిస్‌ ల్యాబ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌. యాక్టివ్‌ ఫార్మాసిటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు లారస్‌ ల్యాబ్స్‌ కొత్త పరిశ్రమకు కూడా భూమి పూజ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news