చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. టీడీపీ ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం అని నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7.05 గంటల వరకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లోని క్యాంప్ సైట్ వద్ద నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. భువనేశ్వరి తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి అని నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి తదితర నేతలు పాల్గొన్నారు.

TDP leaders in Nyayaniki Sankellu program రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల  న్యాయానికి సంకెళ్లు నిరసనలు.. 37 రోజులైనా ఒక్క ఆధారం చూపలేదంటూ ఆగ్రహాలు, tdp-leaders  ...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి హైదరాబాదులోని తమ నివాసంలో చేతులను తాళ్లతో కట్టేసుకుని నిరసన తెలిపారు. న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లని వారు నినదించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఎలుగెత్తారు. కాగా, న్యాయానికి సంకెళ్లు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోందని టీడీపీ వెల్లడించింది. చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా న్యాయానికి సంకెళ్లు అంటూ నారా లోకేశ్ ఇచ్చిన పిలుపు మేరకు ట్విట్టర్ వేదికగా #NyayanikiSankelluForCBN అనే హ్యాష్ టాగ్ తో వేల సంఖ్యలో ట్వీట్స్ వస్తున్నాయని వివరించింది. చంద్రబాబుకు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని టీడీపీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news