వైసీపీ జెండాను తమ గుండెగా మార్చుకున్నారు – సీఎం జగన్‌ ఎమోషనల్‌

-

వైసీపీ జెండాను తమ గుండెగా మార్చుకున్నారని ఏపీ సీఎం జగన్‌ ఎమోషనల్‌ అయ్యారు. వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైయస్ఆర్ సీపీ అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ @YSRCParty ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news