ఏపీ విద్యార్థులకు సీఎం జగన్‌ సర్కార్‌ మరో వరం

-

ఏపీ విద్యార్థులకు సీఎం జగన్‌ సర్కార్‌ మరో వరం ప్రకటించనున్నారు. విదేశీ విద్య కోసం మరో భారీ పథకం తీసుకువచ్చేందుకు యోచిస్తోన్నారు సీఎం జగన్‌. జగనన్న విదేశీ విద్యాదీవెనపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించిన సర్కార్‌… క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును భరించనుంది.

cm jagan
cm jagan

మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించేలా నిర్ణయం తీసుకుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ రానుంది. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపులు ఉండనున్నాయి. ఫస్ట్‌సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు, రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు చేయనుంది సర్కార్‌.

పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉండనుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తింపజేయనుంది. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తించింది సర్కార్‌. ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తించనుంది. ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే ఎంపిక చేయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news