పంటలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక విధంగా నష్టం వాటిళ్లే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు..ఉద్యానవనంలో నాణ్యమైన విత్తనాలు, పండ్లు మరియు పువ్వులు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
విభిన్నమైన నేలలు మరియు వాతావరణాలతో మన దేశంలో అనేక రకాల వ్యవసాయ,పర్యావరణాలు ఉన్నాయి.ఇది వివిధ రకాల ఉద్యానవనాలు, పంటలను పండించడానికి అవకాశాన్ని అందిస్తుంది. హైటెక్ గ్రీన్‌హౌస్‌లు, అంతర్గత పరిశోధనలు మరియు ఆఫ్-సీజన్ వ్యవసాయం ఉద్యానవన రంగంలో కొత్త అవకాశాలను తెరిచాయి.
పిందె,కాయ రాలుటకు కారణాలు..
పిందె, కాయ రాలుట రెండు దశలుగా గమనించవచ్చు చెట్ల పాదుల్లోని ఒడిదుడుకులు, హఠాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులు, కొన్ని చెట్లలో జరిగే రసాయనిక మార్పుల వలన పిందె, కాయ రాలటం జరుగుతుంది. చెట్లు, పూత, పిందెలతో ఉన్నపుడు త్రవ్వడం, దున్నడం చేయరాదు. ఎండలు ముదిరినప్పుడు చెట్లకు నీళ్ళు పెట్టకపోవడం మరియు హార్మోన్ల లోపం వలన మొదలగు కారణాల వలన పూత పిందె రాలడం సంభవించును. కొబ్బరిలో కొత్తగా కాపు పట్టిన లేత తోటలలో 8-10 సంవత్సరముల వయసులో పిందెలు రాలుతూ ఉంటాయి. నీటి యద్దడి సరిగ్గా లేక పోవడం వల్ల, పోటాష్,హార్మోన్ల లోపం వల్ల పిందె రాలుడు ఎక్కువ అవుతాయి. కొన్ని సార్లు పురుగుల తాకిడి వల్ల కూడా రాలుట జరుగుతుంది.
నివారణ చర్యలు..
హార్మోన్ల లోపం వల్ల పూత, పిందె రాలినట్లయితే కృత్రిమంగా 5-10 PPM 2,4-D; 10-20 PPM NAA లేదా 5-10 PPM NUA. పిచికారి చేయడం ద్వారా అరికట్టవచ్చు. కొబ్బరిలో పిందె రాలుట అరికట్టడానికి 30 PPM 2,4-D పిచికారి చేయాలి.
పండ్ల కోత అనంతరం పండ్ల నాణ్యత మరియు నిలువ ఉండే స్వభావం ఏ సమయంలో కోత కోసమో అనే దానిపై ఆధారపడి ఉండును. సరైన సమయంలో పండ్లను కోసినట్లయితే దాని నాణ్యత బాగుంటుంది. కూరగాయలను అవి సరైన పరిమాణం వచ్చినప్పుడు మరియు లేతగా ఉన్నపుడు కోయాలి. వేరు దుంపలు సరైన సమయంలో కోత కోయకుంటే స్పాంజినెస్ మరియు పిదినెస్ వస్తుంది.అందుకే వాటిని సరైన సమయంలో కొయ్యాలి