ధాన్యం కొనుగోళ్ల‌పై జ‌గ‌న్ శుభ‌వార్త‌..21 రోజులలోనే డ‌బ్బులు జ‌మ‌

-

ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి ఇవాళ‌ సమీక్ష స‌మావేశం నిర్వ‌హింంచారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్,… రైతుల‌కు శుభ‌వార్త చెప్పారు. పంటల కొనుగోళ్ల లో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని… సీఎం జగన్ పేర్కొన్నారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలని.. రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమ‌ని తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జ‌గ‌న్‌… దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలని… సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండని పేర్కొన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారా? లేదా? చూడండని… కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై పరిశీలన చేయండ‌ని వెల్ల‌డించారు. వీటిన్నింటిపైనా మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టాల‌ని.. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాల‌ని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news