ప్రభుత్వ వైద్యులకు షాక్‌… వైద్యా శాఖపై సీఎం జగన్ సంచలన నిర్ణయం !

వైద్యారోగ్య శాఖలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ సేవలపై నిషేధం విధించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలన్న నేపథ్యంలోనే సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే.. వైద్యారోగ్య శాఖలో కొత్తగా చేపట్టనున్న 14 వేలకు పైగా పోస్టుల భర్తీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడనుంది ప్రభుత్వం. డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్ సెంటర్లల్లో మొత్తంగా 14037 పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్దం చేసిన వైద్యారోగ్య శాఖ… ఇప్పటికే ఉన్న ఖాళీగా 7740 పోస్టులతో పాటు.. కొత్తగా 6297 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌.

ఈ నెల 27వ తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్న వైద్యారోగ్య శాఖ… డిసెంబర్ 21 తేదీ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేయాలని చేసేలా రిక్రూట్మెంట్ క్యాలెండర్ సిద్దం చేసింది. అదనపు పోస్టుల భర్తీతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం పై రూ. 676.83 కోట్ల భారం పడనుంది..