ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఇవాళ 11 గంటల ప్రాంతంలో కడెం ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు సీఎం కేసీఆర్. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.
ఈ నెల 18 వ తేదీనే ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణ సహకరించకపోవడం, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లలేదు. దీంతో సోమవారం ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్. కాగా తెలంగాణలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు… మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.