ఎంత తిన్నా బరువు పెరగడం లేదా..? పాలకు ఇవి కలిపి తీసుకోండి..!

-

మనకు ఏదైతే కావాలో అది మాత్రమే దేవుడు ఇవ్వడు.. దేనికైతే దూరంగా ఉండాలి, వద్దు అనుకుంటామో అదే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చేలా చేస్తాడు. కావాల్సిందాన్ని కష్టపడి ఎలా అయినా సాధించుకోవడమే జీవితం..అందరూ లావుగా ఉన్నామని బాధపడుతుంటారు.. తగ్గడానికి నానాతంటాలు పడుతుంటారు.. సొసైటీలో ఇంకో వర్గం ఉంది.. పాపం ఎంత తిన్నా పీనుగుల్లానే ఉంటారు. పాచిపోయిన ఫేస్‌తో అసలు తింటున్నారా లేదా అన్నట్లు కనిపిస్తారు.. వాళ్లు కూడా లావు అవడానికి చాలా ట్రై చేస్తారు.. కానీ ఎప్పుడూ అలానే ఉంటారు. మీడియంగా ఉంటే పర్లేదు కానీ..మరీ కట్టెపుల్లలా ఉంటే ఏంబాగుంటది చెప్పండి. మీరు లావు అవ్వాలా..? అయితే ఇప్పుడు చెప్పేవి ట్రే చేయండి చాలు..!

పాలు, అత్తి పండ్లు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో దీనికి విశేష ప్రాధాన్యం ఉంది. పాలను వేడి చేస్తున్నప్పుడు అందులో అంజీర పండ్ల ముక్కలను వేసి గోరువెచ్చగా తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పాలు, బాదం: పాలు, బాదం, జీడి పప్పు మనిషికి ఎంతో బలాన్నిస్తాయి. పాలలో వీటిని కలుపుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌ను సరిగ్గా తీసుకుంటే, వాటి నుండి ఆరోగ్యకరమైన కొవ్వును పొందవచ్చు. వీటిని రాత్రి పడుకునే ముందు పాలలో జోడించి తాగడం మంచిదంటున్నారు నిపుణులు.

పాలు, మఖానా: మఖానాలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మీ బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెంచడానికి పని చేస్తాయి. దీన్ని పాలలో కలుపుకుని తింటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు.

పాలు, ఖర్జూరం: ఖర్జూరాలలో పిండి పదార్థాలు, కేలరీలు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు పాలల్లో ఖర్జూరం నానబెట్టి తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల పొట్టకు కూడా మేలు చేస్తుంది.

సో ఇదిదా మ్యాటర్‌..బరువు పెరగాలంటే.. డ్రై ఫ్రూట్స్‌ను పాలల్లో కలిపి తీసుకోవాలి.. అదే బరువు తగ్గాలంటే.. నానపెట్టుకుని తినాలి. పాలకు ఇలా డ్రై ఫ్రూట్స్‌ జోడించడం వల్ల బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి. బలంగా అవుతారు. ఇంకెందుకు ఆలస్యం ట్రే చేసేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news