తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు..

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు నిర్వహించగా, 531 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

Corona Virus Update: Active COVID-19 cases in country rise to 19,719 | Zee  Business

హైదరాబాదులో 281, రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 612 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,303 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,05,562 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,630 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

 

Read more RELATED
Recommended to you

Latest news