ఏదో అనుకుంటే ఏదో అయినట్లు ఉంది…ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగం మార్చేయాలనే మాట. ఇంకా దేశంలో తానే తోపు..అంతా తనవైపే చూడాలని అనుకున్నారేమో…అందుకే ఏదో పెద్ద స్టేట్మెంట్ వదలలని చెప్పి కేసీఆర్…ఏకంగా రాజ్యాంగం మార్చేయాలని మాట్లాడేశారు. పోనీ కొన్ని సవరణలు చేయాలి…లేదు రాజ్యాంగంలో కొన్ని లొసుగులు ఉన్నాయని చెబితే బాగానే ఉండేది…కానీ రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ కోరడంతో పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ అంశం పూర్తిగా దేశానికి సంబంధించిన టాపిక్ అయిపోయింది.
కేసీఆర్ ఏమో ఏదో సంచలనం కోసం మాట్లాడినట్లు ఉన్నారు..చివరికి అదే రివర్స్ అయ్యి టీఆర్ఎస్కు డ్యామేజ్ జరిగే పరిస్తితికి వచ్చింది. ఇక కేసీఆర్ మాటలపై కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తన మాటలని ఉపసంహరించుకోవాలని, అసలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి, అంబేడ్కర్‌ని అవమానించారని చెప్పి ఫైర్ అవుతున్నారు. కేసీఆర్‌పై దేశ ద్రోహం పెట్టాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి.
సరే కేసులు లాంటివి పెట్టడం కుదరకపోయినా..ఇలా రాజ్యాంగం మార్చాలనే మాటలు మాత్రం టీఆర్ఎస్కు డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు దీక్షలు చేస్తున్నారు. బీజేపీ అయితే భీం దీక్షలని చేస్తుంది. అంటే కేసీఆర్…అంబేడ్కర్‌ని అవమానించారని చెప్పి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్, బీఎస్పీ, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవమానపర్చేలా, అంబేడ్కర్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే వాటిని ఉపసంహరించుకుని, జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలా ఎక్కడకక్కడ కేసీఆర్‌పై పోరు మొదలైంది. అయితే అంబేడ్కర్ దళితులతో ఎక్కువ ముడిపడిన దేశనేత…రాజ్యాంగం గురించి మాట్లాడి…ఇప్పుడు దళితుల ఓట్లనే కేసీఆర్ దూరం చేసుకునే పరిస్తితి వచ్చింది. ఇప్పటికే దళితులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు…ఏదో దళితబంధు అంటూ కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇలా రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేసి కేసీఆర్, అనసరంగా టీఆర్ఎస్కు డ్యామేజ్ చేసుకునేలా కనిపిస్తున్నారు.