కేంద్రం చెత్త పాలసీల కారణంగా రాష్ట్రాల మధ్య విబేధాలు : సీఎం కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి కారణంగా రాష్ట్రం అనేక ఇబ్బందులు పడుతోందని అన్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రం 3లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ ఆరోపించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్న స్థాయిలో కూడా కేంద్రం పనిచేయడం లేదని విమర్శించారు సీఎం కేసీఆర్. కేంద్రం తీసుకొస్తున్న చెత్త పాలసీల కారణంగా రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటాలను ఇంకా తేల్చకపోగా.. మత విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్.

పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో ముందుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 87వేలుగా ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం 2 లక్షల 78వేలకు చేరిందని అన్నారు. జీఎస్డీపీ సైతం 5లక్షల కోట్ల నుంచి 11.50 లక్షల కోట్లుకు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు కేసీఆర్. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి మనిషి పుట్టుక నుంచి చావు దాకా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news