మునుగోడు ఉప ఎన్నికల్లో అందరూ అనుకున్నదే జరిగింది. అధికార టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బిజెపి అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫై టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టాడు.
మునుగోడు ఉప ఎన్నికల్లో 10,307 ఓట్ల తేడాతో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే, మునుగోడు ఒక ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు పై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు అభినందనలు. విజయానికి సహకరించిన సిపిఐ, సిపిఎం నేతలకు కృతజ్ఞతలు అని కేసీఆర్ చెప్పారు. అనంతరం టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల కు ఫోన్ చేసిన కేసీఆర్, శుభాకాంక్షలు తెలియజేశారు.