ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ప్రజలు బాగుపడతారు అనుకున్నాం కానీ.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగ యువత ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. కొన్ని దేశాల్లో హింస లేకుండా శాంతియుత పాలన ఉందని.. సమాజంలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడే హింసలకు పాల్పడతారని అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్నాం కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు లేవు, విద్యా విధానాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు ప్రొఫెసర్. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని రిజర్వేషన్ అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారు… 5 రూపాయల భోజనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ కంప్లీట్ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని.. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు.