రేపు టిఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

-

రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించనుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఈ సమావేశం టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన జరుగనుంది. బీజేపీనీ టార్గెట్ చేస్తూ ఈ సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.

kcr

తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తూ… తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరు తెన్నెల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఈ సందర్భంగా రూపొందించనున్నారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా హాజరుకానున్నారు.

కాగా గత వారం రోజుల నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీల మధ్య.. ధాన్యం కొనుగోలు అంశంపై తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్రంపై టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే… రాష్ట్ర బీజేపీ మాత్రం టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే.. రేపు సమావేశం నిర్వహించనున్నారు సిఎం కెసిఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version