ఎమ్మెల్యే టికెట్ల కోసం.. దేవుడి మెట్ల వ‌ద్ద బిచ్చ‌గాళ్లు కూర్చున్నట్టే : సీఎం కేసీఆర్‌

-

తూంకుంట‌లోని క‌న్వెన్ష‌న్ హాల్‌లో గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నాయ‌కుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేను మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆ రోజున్న ముఖ్య‌మంత్రి కేబినెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుతారు అంటే.. ఇక తెలంగాణ‌కు పెట్ట‌బ‌డులు రావు అని అన్న‌డు. అట్లెట్ల స‌ర్.. నాక‌ర్థం కాదు అని ప్ర‌శ్నించాను.. త‌ల్లే ద‌య్యం అయినాక పిల్ల ఎట్ల బ‌తుకుత‌ది అని ప్ర‌శ్నించాను.

Telangana CM KCR to soon launch national party | Mint

నాడు ఎన్నిక‌లు రాగానే.. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌కు టికెట్లు ముందు ఇచ్చేవార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ద‌గ్గ‌ర ఉంట‌దనే నెపంతో లాస్ట్‌కు ఇచ్చేవారు. ఓ ఎల‌క్ష‌న్ల మా నాన్న చ‌నిపోతే నేను టికెట్ కోసం పోలేదు. అప్పుడు ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు. మీ టికెట్ ఫైన‌ల్ అయిందంట‌.. వచ్చి ఫారాలు తీసుకొని వెళ్ల‌మ‌ని ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని డీఎస్పీ వ‌చ్చి నాకు చెప్పిండు. తెల్లార‌గానే హైద‌రాబాద్ వ‌చ్చాను.. నాచారం స్టూడియోలో ఫారాలు ఇస్తున్నారంటే అక్క‌డికి వెళ్లాను. అక్క‌డ అంద‌రు తెలంగాణ వారే ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దేవుడి మెట్ల వ‌ద్ద బిచ్చ‌గాళ్లు కూర్చున్న‌ట్టు కూర్చున్న‌రు. చాలా బాధ క‌లిగింది. ఇది ఏం ప‌ద్ధ‌తి అని.. టెంటు వేసి నాలుగు కుర్చీలు వ‌స్తే.. స‌రిపోయేది క‌దా అని అనుకున్నాను. సేం బిచ్చ‌గాళ్ల సీనే క‌నిపింద‌ని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news