కేంద్రమంత్రి సింధియా తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింధియా తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ కు చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు జ్యోతి రాదిత్య సింధియా కు స్వాగతం పలికారు సిఎం కెసిఆర్.

అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి భోజనం చేశారు కేంద్ర మంత్రివర్యులు జ్యోతి రాదిత్య సింధియా. ఇక అనంతరం సిఎం కెసిఆర్ తో జ్యోతి రాదిత్య సింధియా భతి కానున్నారు. ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు విమానాశ్రయాల అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు సమస్యల పై చర్చించనున్నారు. ఇక ఈ భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు జ్యోతి రాదిత్య సింధియా. మెడిసిన్ ఫ్రొం ది స్కై ప్రాజెక్టు ను దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ ప్రాజెక్టు ను… కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ ఉదయం  ప్రారంభం చేశారు.