సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ తొలి బహిరంగ సభకు తెలంగాణ గడ్డపై నుంచే సమర శంఖం పూరించేందుకు నిర్ణయించారు. టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత తొలి బహిరంగ సభను ఢిల్లీ వేదికగా నిర్వహించాలని భావించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాను వేదికగా నిర్ణయించుకున్నారు సీఎం కేసీఆర్. ఈనెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు నిర్ణయించారు.
కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల మధ్య 45 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, కొత్తగూడెంలో నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందిన బిఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భేటీ కాబోతున్నారు. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి రావాలని మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందింది.