మరోమారు సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం 7 గంటలకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈసారి కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. తాజా కేంద్రం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు మంత్రులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. దీంతో సాయంత్రం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది.
గత మీడియా సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పనితీరుపై తీవ్రంగా విమర్శించిన కేసీఆర్ మరోసారి వడ్ల కొనుగోలు అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది .కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాగా రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తారా ..? లేదా.. ? అని గత మీడియా సమావేశాల్లో బీజేపీని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్రం కొనుగోలు చేయలేమని చెప్పింది.