రాకేశ్​ మృతిపట్ల సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి.. 25 లక్షల ఆర్ధికసాయం

-

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ నియామకాల విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు ప్రజ్వరిల్లగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రాథమిక అంచనాల మేరకు సుమారు రూ. 7 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ మృతి పట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. రాకేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అతని కుటుంబానికి ఏకంగా 25 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. రాకేష్ కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాజేష్ మృతిచెందాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news