తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

-

హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే.. సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీలను తక్షణమే మంత్రివర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడలేని హోం మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ఢిల్లీ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో బ్రిజ్ భూషణ్‌లు ఉన్నారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ వ్యాఖ్యనించారు.

Telangana: RS Praveen Kumar accuses state govt of phone hacking

ఓ వెటర్నరీ డాక్టర్ హరిక్రిష్ణకు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఎలా స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తారని, పశుసంవర్థక శాఖ నుండి క్రీడా శాఖకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడనే క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతనికి డెప్యుటేషన్ ఇచ్చారని ఆరోపించారు. కీచకుడు ఓఎస్‌డీ హరిక్రిష్ణపై ప్రభుత్వం సిట్ వేసి స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగిన లైంగిక వేధింపులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు.

స్పోర్ట్స్ స్కూల్‌లో పనిచేస్తున్న హరికృష్ణ, క్రీడల మంత్రికి ప్రధాన అనుచరుడైనందుకే ప్రభుత్వం అతనిని కాపాడుతుందని తీవ్రంగా
మండిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని జల్‌పల్లి
మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పాతబస్తీకి చెందిన సామజిక కార్యకర్త హత్య షేక్ సయీద్ బావజీర్‌ను బండ్లగూడలో హత్య చేయడం దారుణమన్నారు. హత్యకు ముందే హోం మంత్రికి మహమూద్ అలీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన ప్రాణాలు కాపాడలేకపోయారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news