హైదరాబాద్: పీవీ నరసింహారావు శత జయంత్రి సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుబాషా శాలి అని కొనియాడారు. దేశంలో పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. పీవీని ఎంత స్మరించుకున్నా తక్కువేనన్నారు. ఆయనొక స్ఫూర్తి శిఖరమని, దీప స్తంభమన్నారు. ఆయన పని చేసిన ప్రతి శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. విద్యాశాఖలో పీవీ తెచ్చిన సంస్కరణలతో ఎంతో మంది విద్యార్థినులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.
పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలో డీజీపీ మహేందర్ రెడ్డి చదువుకున్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అయ్యారు. తెలంగాణలో భూ సంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదేనని చెప్పారు. 800 ఎకరాల భూమిని పీవీ ఇతరులకు దానం చేస్తూ నిబద్ధత చాటుకున్నారని కేసీఆర్ తెలిపారు. గొప్ప అధ్యయన వాది, సంస్కరణ వాది అని అన్నారు. పీవీ నరసింహారావు చిరస్మరణీయులని చెప్పారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ నరసింహరావు విద్యా పీఠాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భారత దేవంలో పీవీ సేవలు మరువలేనివని కేసీఆర్ చెప్పారు. పీవీ తెలంగాణ ఠీవీ.. ఎప్పటికి తెలంగాణ మదిలో ఉండిపోతారని కేసీఆర్ తెలిపారు.