కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు..!

-

సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంట‌ల పాటు జరిగిన ఈ స‌మావేశంలో కేబినెట్‌ ప‌లు కీల‌క బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. ఇందులో కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపింది. సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించి పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది. ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 కూడా ఆమోద‌ముద్ర వేసింది.

CM-KCR
 

అలాగే కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ నెల 10వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. ” అసెంబ్లీలో ఎల్లుండే కొత్త రెవిన్యూ చట్టం ప్రవేశపెడుతున్నాం. చాలా మంచి చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఈ రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో పాసైన రోజు ప్రతీ గ్రామంలో బాణాసంచా కాల్చాలి. అంతేకాకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news