బండి సంజయ్ కి.. తలకాయే లేదు : సీఎం కేసీఆర్ సీరియస్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై, అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ తాను చాలా రోజులనుంచి ఓపిక పడుతున్నానని… అసలు తెలంగాణ బిజెపి అధ్యక్షుడికి అసలు తలకాయ లేదని నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్.

అతని సొల్లు మాటలు విని రైతులు వరి ధాన్యం వేయకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నది అని అధికారికంగా చెబుతుంటే… తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.

ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్రం రోజుకోమాట చెప్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ‌లో యాసంగి వ‌రిపంట అంటే బాయిల్డ్ రైసే. భ‌విష్య‌త్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వ‌మ‌ని చెబితేనే కొంటామ‌ని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌.