కేసీఆర్ ను టచ్ చేసి చూడు బిడ్డా… బండి సంజయ్ కి కేసీఆర్ వార్నింగ్

కేసీఆర్ ను టచ్ చేసి చూడు బిడ్డా.. కేసీఆర్ ను జైలుకు పంపి నువ్వు బతికి బట్టకడతావా…అని తీవ్ర స్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తీవ్రంగా హెచ్చిరించారు కేసీఆర్. తొలిసారిగా బండి సంజయ్ విమర్శలపై కేసీఆర్ తీవ్ర స్థాయితో విరుచుకుపడ్డాడు. ఇన్నాళ్లు బండి సంజయ్ మాటలను క్షమించాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక మీదట సహించం అన్నారు. పెద్దా… చిన్నా లేకుండా ఇష్టం వచ్చినట్లు బండి సంజయ్ మాట్లాడుతన్నాడని అన్నారు. కళ్లు నెత్తికెక్కి, బలుపుతో మాట్లాడుతున్నావా..అని సంజయ్ ను హెచ్చరించారు. మా మెడలు వంచుతామన్నారు కదా.. ఇక మీదట మీ మెడలు విరుస్తామని తీవ్ర పదజాలంతో బీజేపీ నాయకులను హెచ్చరించారు.

  కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర అభివ్రుద్ది కోసం కష్టపడుతున్నామని అన్నారు. కేంద్రంలో ఎందుకు గొడవ అని ఇన్నాళ్లు ఊరుకున్నామన్నారు. ఇన్ని రోజులు మీ ఆటలు సాగాయని.. ఇక మీదట మీ ఆటలు సాగవని బీజేపీని ఉద్దేశించి అన్నారు. మీకు చేత కాక ప్రజలపై భారం పెంచుతున్నారని కేంద్రాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుంది. ఇక మీదట బీజేపీ వెంబడి పడుతామని.. బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదని కేసీఆర్ బీజేపీని హెచ్చరించారు.