ఏపీ పోలీసు వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేయబోతోంది : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలోని పోలీస్ వ్యవస్థపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందంటూ ఆయన పేర్కొన్నారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందని.. త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని.. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలన్నారు.

పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదు.. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని.. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని పేర్కొన్నారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని.. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తోందని.. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోందని ఫైర్ అయ్యారు. సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న ఇంటరెస్ట్.. ప్రజా సమస్యలపై ఎందుకు లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news