రాజకీయ నాయకులను కరోనా నానా రకాలుగా వేధిస్తుంది. కరోనా నుంచి ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా కేసులు రాజకీయ నాయకులను అసలు వదిలిపెట్టడం లేదు. తాజాగా మరో నేతకు ఏపీలో కరోనా సోకింది. ఏపీ బిజెపి రాజ్యసభ ఎంపీ సిఎం రమేష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అన్నారు.
తాను హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. తనకు కరోనా లక్షణాలు లేకుండా వచ్చిందని చెప్పారు. ఇక ఏపీలో ఇప్పటికే దాదాపు 20 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు మంత్రులకు కూడా కరోనా సోకింది. వారిలో చాలా మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.
I have tested positive for #COVID__19. Whilst I am doing fine, I am being under isolation on the recommendation of doctors.
— CM Ramesh (@CMRamesh_MP) August 7, 2020