HCA వివాదం పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..!

-

HCA వివాదం పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మరోవైపు పాసుల వ్యవహారం పై వివరాలను సేకరించింది సీఎంవో కార్యాలయం. సన్ రైజర్స్ యాజమాన్యానికి వేధింపుల పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే పాసుల వ్యవహారం, HCA వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి SRH యజమాన్యం సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సీఎంకి లేఖ అందగానే వెంటనే విచారణ చేపట్టాలని కోరగా.. రాచకొండ పోలీసులతో విచారణ జరిపించారు. పాసుల వ్యవహారం పై వేధించిన విషయం వాస్తవమేనని తేలింది. HCA-సన్ రైజర్స్ వివాదం పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.

విజిలెన్స్ ఎంక్వైరీ చేయనున్నట్టు తెలుస్తోంది. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.   ఇలాగే వేధింపులకు పాల్పడితే.. ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లను హైదరాబాద్ నుంచి మరో వేదికకు మార్చుతామని ఎస్ఆర్హెచ్  పేర్కొనడం గమనార్హం.  హోం గ్రౌండ్ హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి తరలివెళ్తామని పేర్కొంది.  SRH యాజమాన్యంపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news