కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగుకు మహిళా సంఘాలకు చెందిన లేడీస్ ప్రతి ఒక్కరూ రావాలని సీఎం రేవంత్ రెడ్డి హుకుం జారీ చేసినట్లు ఆడియో రికార్డు ఒకటి వైరల్ అవుతోంది. మీటింగ్‌కు హాజరవ్వకపోతే లోన్స్ ఇవ్వమని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు అందులోని సంభాషణలు ఉన్నాయి. మీటింగ్‌కు వచ్చిన మహిళలకు డబ్బులు కూడా ఇస్తామని తెలిపినట్లు సమాచారం.
ఉప్పల్ నియోజకవర్గ మహిళా సంఘాల గ్రూపుల్లో ఆడియో రికార్డ్ వైరల్ అవుతోంది.పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్‌కు హాజరవ్వకపోతే రుణాలు ఇవ్వమని మహిళలను అధికారులు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ వారే తెచ్చుకోవాలని, వాటికి సంబంధించిన డబ్బులు రెండు రోజుల్లో ఇస్తామని, ఖచ్చితంగా అందరూ రావాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.తాము చెప్పే వరకు మీటింగ్ నుండి కదలవద్దని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.