రాష్ట్రానికి శీత‌ల గాలులు.. మ‌రో మూడు రోజులు ఇదే ప‌రిస్థితి

-

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు భారీ స్థాయిలో ప‌డిపోతున్నాయి. రికార్డు స్థాయిలో క‌నిష్ట ఉష్ణోగ్రతలు న‌మోదు అవుతున్నాయి. రాత్రి స‌మ‌యంలోనే కాకుండా ప‌గ‌టి పూట కూడా ఉష్ణోగ్రతలు ప‌త‌నం అవుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ప‌గ‌టి పూట ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావాలంటే.. జంకుతున్నారు. కాగ ఉత్త‌ర భార‌త్ నుంచి శీత‌ల‌గాలులు వ‌స్తున్నాయ‌ని.. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప‌డిపోతున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. అలాగే మ‌రో మూడు రోజుల ఇలాంటి ప‌రిస్థితులే ఉంటాయ‌ని తెలిపింది.

ఈ మూడు రోజుల పాటు ప్ర‌జ‌లు చ‌లి ప‌ట్ల జ‌గ్ర‌త్త‌గా ఉండాల‌ని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. అయితే రాష్ట్రంలో ప్ర‌స్తుతం కొన్ని ప్రాంతాలల్లో సాధార‌ణం కంటే.. 8 నుంచి 9 ఉష్ణోగ్రతలు ప‌డిపోతున్నాయి. శ‌నివారం రాష్ట్రంలో అత్య‌ల్పంగా ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి) అనే గ్రామంలో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదైంది. జ‌న‌వ‌రి మాసం చివ‌రి వారంలో ఇంత త‌క్కువ ఉష్ణోగ్రతలు న‌మోదు అవ‌డం గ‌త కొద్ది ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. 2020 లో ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు అయింది. దీని త‌ర్వాత ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు ప‌డిపోవ‌డం ఇదే తొలిసారి. కాగ కుమురం భీం జిల్లాలో 5.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news