రికార్డులను తిరగరాస్తున్న KGF2.. ఆరో రోజు కలెక్షన్స్ అన్ని కోట్ల?

-

KGF2 ఫిల్మ్ ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నదని చెప్పొచ్చు. ఈ నెల 14న విడుదలైన పిక్చర్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. రాఖీభాయ్ రికార్డులను తొక్కుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం అంచనాలను మించి వసూళ్లు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మూవీ ఆరు రోజుల్లో రూ.645 కోట్లను వసూళ్లు చేసి రికార్డును సృష్టించింది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ ఆల్రెడీ దాటేసిన KGF2..ఆరో రోజు రూ.250 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజానీకం ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తోంది. KGF2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ టైంలోనే అనగా ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా రూ.1,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇండియాలోనే కాదు బయట కూడా KGF2 హవా కొనసాగుతోంది. ఓవర్సీస్ లో సత్తా చాటుతున్న ఈ పిక్చర్..ఐదు రోజుల్లో 5 మిలియన్‌ డాలర్ల వసూలు చేసింది. KGF2 పిక్చర్ ఇంతటి ఘన విజయం సాధించి..ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తుండటం పట్ల సినీ పరిశ్రమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ ప్రతిభను KGF2 ద్వారా నిరూపించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. ఇందులో యశ్, శ్రీనిధిశెట్టి హీరో హీరోయిన్స్ కాగా, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, సంజయ్ దత్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news