ఎలాంటి స‌పోర్టు లేకుండా వ‌చ్చి నిల‌దొక్కుకున్నాడు హీరో విశ్వ‌క్‌సేన్‌. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత హీరోగా య‌వ నటుడుగా మారాడు విశ్వక్. టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోగా రాణిస్తున్నాడు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఈ ఫలక్‌నామ్‌ దాస్‌ దూసుకెళుతున్నాడు.

ఇక తాజాగా విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ సరసన రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుద చేసింది చిత్ర బృందం. ఫన్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌విసీసీ డిజిటల్‌ బ్యానర్‌ పై ఆయన తనయుడు బాపినీడు సుధీర్‌ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహిస్తున్నారు.