ఆత్మ‌హత్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు ప‌రిహారం.. రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించేందుకు ముందుకు వ‌చ్చింది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ ఒక్కో రైతు కుటుంబానికి రూ. 6 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 133 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని వారి కుటుంబాల‌కు రూ. 6 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని తెలిపింది.

అందుకు కావాల్సిన రూ. 7,95 కోట్ల ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. కాగ తెలంగాణ రాష్ట్రంలో వ‌ర‌ద‌లతో పంట న‌ష్టం అలాగే అప్పులు భారం తో పాటు మ‌రి కొన్ని కార‌ణాల వ‌ల్ల రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిహారం ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. కాగ ఆత్మ హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని ప్ర‌తి ప‌క్షాలు ఇప్ప‌టి వ‌ర‌కు డిమాండ్ చేస్తూ వ‌చ్చాయి. అలాగే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా రైతు క‌టుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని ఇప్ప‌టికే ప‌లు సార్లు ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news