మోడీ హయాంలో యువతకు భవిష్యత్తు లేదు – సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

-

మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని అన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఆర్ఎస్ఎస్ విధానాలే మోడీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మోడీని నడిపిస్తుందే ఆర్ఎస్ఎస్ అంటూ దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని.. దేశంలో అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడేవారుు ఉన్నారని కానీ ఆర్ఎస్ఎస్ అలా చెప్పడం మంచిది కాదన్నారు. కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని మండిపడ్డారు.

పబ్లిక్ సెక్టార్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారని.. మోడీ ఆర్థిక విధానాలు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, పేదలు గానే ఉంటున్నారని.. మోడీ హయాంలో యువతకు భవిష్యత్తు లేదన్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు కరోనా సమయంలో దేశ ప్రజలను లూటి చేశాయన్నారు. కమ్యూనిస్టులు ఏకం అయితే ప్రజలు అధికారం వైపు తీసుకువెళతారని ధీమా వ్యక్తం చేశారు. మోడీ విధానాలు వ్యతిరేకించడంతోపాటు ప్రత్యామ్నాయ విధానాలు చూపెడతామన్నారు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు కూడా చూపెడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news