బకాయిలు చెల్లించని పర్యాటక సంస్థలను జప్తు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన టీమ్ తో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు సందర్శక ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా మారుస్తూ రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరేలా ప్రణాళికలు రచించారు. తాజాగా ఆ శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు.

పర్యాటకశాఖకు లీజుదారులు చెల్లించాల్సిన వాస్తవ బకాయిలపై నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. జప్తు చేసిన స్నో వరల్డ్‌ను పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కొనసాగించాలని స్పష్టం చేశారు. స్నో వరల్డ్‌ మాదిరిగా బకాయిలు చెల్లించని సంస్థలను తక్షణమే జప్తు చేసి, వాటిని పర్యాటకశాఖ అధ్వర్యంలో కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పీపీపీ పద్ధతిలో కొనసాగుతున్న పర్యాటక ప్రాజెక్టుల బకాయిలపై మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థల నుంచి రూ.41.88 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆడిట్‌ అధికారులు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖల కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి కరోల్‌ రమేశ్‌, కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news